Kaduva Telugu Teaser | మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కడువ’. షాజి కలిస్ దర్శకత్వం వహించాడు. ఈ మధ్య కాలంలో సుకుమార్ సినిమాలకు దేశ వ్యాప్తంగా విశేష ఆధరణ వస్తుంది. ఈయన కథలు ఎంపిక చేసుకునే విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. ఈ క్రమంలో ‘కడువ’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని పృథ్విరాజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే బెంగళూర్, హైదరాబాద్ వంటి సిటీలలో ప్రెస్ మీట్‌ను నిర్వహించి సినిమా ప్రమోషన్లను చేశాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 30న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నాని విడుదల చేశాడు.
‘ఎవడ్రా మీ ఊర్లో కురియన్ అంటా.. వాడెవడో కొత్తోడై ఉంటాడు సర్’ అంటూ టీజర్ ప్రారంభమైంది. ‘ఊర్లో వాడికి ఇంకో పేరుంది. కురువచ్చన్.. కడువపున్నే కురువచ్చన్’ అంటూ హీరో ఇంట్రడక్షన్ ఫుల్ మాస్‌గా ఉంది. ‘ఆయన ఒక చిరుత సర్.. వేట కోసం కాచుకున్న చిరుత’ అంటూ వచ్చే ఎలివేషన్ డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. టీజర్ మొత్తం హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఆకట్టుకుంటుంది. జేక్స్ బేజోయ్ సంగీతం వేరే లెవల్లో ఉంది. అభినందన్ రామానుజమ్ కెమెరా విజువల్స్ బాగున్నాయి.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై సుప్రియ మీనన్ లిస్టిన్ స్టీఫెన్ నిర్మించాడు. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పృథ్వీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో ‘గోల్డ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. నయనతార నటించిన ఈ చిత్రానికి ‘ప్రేమమ్’ ఫేం ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించాడు.
Happy to launch the teaser of #కడువా #Kaduva
My best wishes to @PrithviOfficial gaaru and his team 🤗Here’s the linkhttps://t.co/p4oeKucNbW@vivekoberoi @iamsamyuktha_ #Shajikailas @JxBe @PrithvirajProd @magicframes2011
— Nani (@NameisNani) June 25, 2022