ఎప్పుడూ ఏదో ఒక ట్రెండీ, స్టైలిష్ లుక్‌తో నెట్టింట హల్ చల్ చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. (Mahesh Babu). ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ మోనోక్రోమ్ డాపర్ లుక్ (Mahesh monocrome look)లో కెమెరాకు ఫోజులిచ్చిన స్టిల్‌ను నెట్టింట షేర్ చేయగా..ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ స్టిల్ చూసిన ఫ్యాన్స్ తాజా లుక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) డైరెక్షన్లో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28) సినిమా కోసమే అయి ఉంటుందని తెగ చర్చల్లో మునిగిపోయారు.
ఇదిలా ఉంటే లేటెస్ట్గా మరో లుక్‌తో అదరగొట్టేస్తున్నాడు మహేశ్ బాబు. ఎప్పుడూ పల్చని గడ్డంతో కనిపించే మహేశ్ ఈ సారి మాత్రం కాస్త డోస్ పెంచేసి..న్యూ లుక్‌లో అదరగొడుతున్నాడు. సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ లియోర్డ్ స్టీవెన్స్ (Lloyd Stevens) సోషల్ మీడియా ఫ్రొఫైల్స్ తో మహేశ్ తో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. మొత్తానికి త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే ముందు ఇలా స్టైలిష్ లుక్స్ తో కనిపిస్తూ..ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు మహేశ్.
మహేశ్ తాజా స్టిల్కు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28లో పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
Read Also :Godfather | ‘గాడ్ ఫాదర్’ కొత్త అప్డేట్..బర్త్ డే ట్రీట్‌కు చిరు రెడీ..!
Read Also : Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!
Read Also :Vassishta | అబ్బాయితో సక్సెస్..త్వరలోనే బాబాయితో కూడా..!