e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ఆహా ఏమి రుచి..

ఆహా ఏమి రుచి..

ఆహా ఏమి రుచి..

నోరూరించే మాచర్ల కాల్చిన మటన్‌
నిత్యం మాంసం దుకాణాల వద్ద కిటకిట
ఏపీ, కర్ణాటక నుంచి జనం రాక
మాంసం ప్రియుల ఫిదా..

గట్టు, మార్చి 27 : జోగుళాం బ గద్వాల జిల్లా గట్టు మండలంలోని మాచర్ల పేరు చెప్పగానే కాల్చిన మటన్‌ గుర్తురాక తప్పదు. మటన్‌ ముక్కలకు మసాలాలు దట్టించి.. సీకులపై పేర్చి.. చిన్న మంటపై కాలుస్తుంటే.. వచ్చే సువాసనకు మాంసం ప్రియులు ఫిదా కావాల్సిందే. ప్రతి ఆదివారం గ్రామంలోని మటన్‌ దుకాణా లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాల్లోని మాం సం ప్రియులు కాల్సిన మటన్‌ను ఆరగించడానికి ఇక్కడికి వస్తుంటారు. మాచర్ల మటన్‌ ప్రత్యేకతపై ‘నమస్తే తెలంగాణ’ సండే స్పెషల్‌..
మాచర్ల గ్రామంలో ప్రతి ఆదివారం సంత నిర్వహిస్తారు. సెలవు రోజు కావడంతో సంతలో జనం కి క్కిరిసి ఉంటారు. అ యితే ఇక్కడి సంతలో మటన్‌ దుకాణాలదే ప్రత్యేకం. ఏ పల్లెలో చూసినా ఒకటి, రెండు మటన్‌ దుకాణా లు ఉంటాయి. కానీ మాచర్లలో మాత్రం పది వరకు దుకాణాలు ఉన్నాయి. సోమవారం, గురువారం, శనివారం మినహా అన్ని వారాల్లో మాంసం అమ్మకాలు కొనసాగుతాయి. ఇక ఆదివారాలు, పండగలు, సమీప గ్రామాల్లో జాతరలు, దేవర్లు ఉన్నాయంటే చాలు మాచర్లలోని మాంసం దుకాణాలు కిటకిటలాడాల్సిందే. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరైనా సంతకు వచ్చారంటే కాల్చిన మటన్‌ రుచి చూడక మానరు. కాల్చిన మటన్‌ను తినేందుకు ఏపీలోని కర్నూల్‌, ఎమ్మిగనూర్‌, కోడుమూరు, ఆదోని, కర్ణాటకలోని రాయిచూర్‌, ఎరగేర, తెలంగాణలోని గద్వాల, అయిజ, శాంతినగర్‌ తదితర ప్రాంతాల నుం చి మాంసం ప్రియులు ఇక్కడి వస్తారు. అయితే, తమకు కూడా కష్టనష్టాలు ఉన్నాయని మాంసం విక్రయదారులు తెలుపుతున్నారు. జీవాలు దొరకకపోవడంతో మాంసం విక్రయాలు మానుకునే పరిస్థితులు వచ్చాయని వాపోతున్నారు. దీనికితోడు కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ప డుతున్నామంటున్నారు. పొట్టేళ్ల ధరలు ఎప్పుడికప్పుడు పెరిగిపోతున్నాయని, ఈ కారణంగా తమ కు గిట్టుబాటు కావ డం లేదంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆహా ఏమి రుచి..

ట్రెండింగ్‌

Advertisement