e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News ధ‌ర్మ‌స్థ‌లిలో సంబ‌రాలు షురూ..!

ధ‌ర్మ‌స్థ‌లిలో సంబ‌రాలు షురూ..!

ధ‌ర్మ‌స్థ‌లిలో సంబ‌రాలు షురూ..!

మెగాస్టార్‌ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆచార్య‌. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకాపేటలో భారీ టెంపుల్‌ సెట్‌ వేసి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఆ టెంపుల్‌కు సంబంధించి ఓ వీడియోను కూడా ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో రామ్‌చరణ్‌ పవర్‌పుల్‌ నక్సలైట్‌ నాయకుడి పాత్రలో కనిపిస్తే.. చిరంజీవి మాజీ నక్సలైట్‌ పాత్రలో కనిపిస్తారు.

ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథాంశం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన దేవాలయాల భూముల అన్యాక్రాంతంను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని డైరెక్టర్‌ కొరటాల శివ ఈ కథను సిద్ధం చేశారు. మే 13న ఆచార్య చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. మార్చి 31 సాయంత్రం 4.05 ని.ల‌కు చిత్రం నుండి లాహె లాహె అనే సాంగ్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. తొలి లిరిక‌ల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధ‌ర్మ‌స్థ‌లిలో సంబ‌రాలు షురూ..!

ట్రెండింగ్‌

Advertisement