హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతున్నది. జలాశయం జరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 811.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలకు గాను 35.277 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 6357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.