సురేంద్రకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లోకమెరుగని కథ’. క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై రవికాంత్ జమి నిర్మిస్తున్నారు. గురువారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథా చిత్రమిది. చక్కటి సందేశం ఉంటుంది. పాత ఆచార వ్యవహారాల్ని పాటించే తండ్రి, నేటి ఆధునిక పోకడల్ని అనుసరించే కొడుకు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కించాం.
తూర్పు గోదావరి జిల్లాలో చిత్రీకరణ జరిపాం. సందేశాత్మక ప్రేమకథగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు శ్రీకాంత్ కొప్పుల పేర్కొన్నారు. త్వరలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ తుమ్మల, మాటలు: ఎస్.ఎన్.ఆర్, తరిణిక, దర్శకత్వం: సురేంద్ర కుమార్.