e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News లాక్‌డౌన్‌ విజయవంతం : ఢిల్లీ సీఎం

లాక్‌డౌన్‌ విజయవంతం : ఢిల్లీ సీఎం

లాక్‌డౌన్‌ విజయవంతం : ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ : కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో విధించిన లాక్‌డౌన్‌ విజవంతమైందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. గత కొద్ది రోజులుగా ఆక్సిజన్‌ పడకల సంఖ్యను పెంచామని, జీటీబీ హాస్పిటల్‌ సమీపంలో 500 కొత్త ఐసీయూ పడకలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఐసీయూ పడకలు, ఐసీయూ కొరత లేదని చెప్పారు. ప్రతి రోజు 1.25లక్షల మోతాదుల టీకా వేస్తున్నామని, త్వరలో మూడు లక్షల టీకాలు వేస్తామని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో ఢిల్లీ వాసులందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. కానీ టీకాల కొరతను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొద్ది రోజులకే స్టాక్‌ మిగిలి ఉందని చెప్పారు. రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయని, నెలకు 6 నుంచి 7 కోట్ల టీకాలు ఉత్పత్తి చేయగలుగుతాయన్నారు. ఇలా ఐతే ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడానికి రెండేళ్లు పడుతుందన్నారు. అప్పటి వరకు మరిన్ని కరోనా వేవ్‌లు వస్తాయని, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచడం ముఖ్యమని, టీకాలు వేసేందుకు జాతీయ ప్రణాళిక రూపొందించాలని కేంద్రాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి..

Good News : 12-15 ఏళ్ల వారికీ టీకా
భారత్‌కు 15 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన ట్విట్టర్‌
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
కరోనా థర్డ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌.. మలేషియాలో జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌
కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్‌ గౌరీ అమ్మ కన్నుమూత
దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. 24గంటల్లో 3.29లక్షల కేసులు..
కరోనా ఎఫెక్ట్‌.. శ్రీశైలంలో కళ్యాణకట్ట మూసివేత
చైనాలో 1.4 బిలియన్లకు చేరిన జానాభా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ విజయవంతం : ఢిల్లీ సీఎం

ట్రెండింగ్‌

Advertisement