e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News లైగ‌ర్ సినిమా కోసం మైక్ టైస‌న్ అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా?

లైగ‌ర్ సినిమా కోసం మైక్ టైస‌న్ అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా?

అతని పంచ్‌.. పవర్‌ రింగ్‌లో దిగిన ప్రత్యర్థికే కాదు, బాక్సింగ్‌ను ఆస్వాదించే అభిమానులకూ తెలుసు.అందుకే ముద్దుగా ‘ఐరన్‌ మైక్‌’ అని పిలుచుకొంటారు. చిన్నపిల్లాడి మనస్తత్వం కావడంతో, ‘కిడ్‌ డైనమైట్‌’ అన్న పేరు వచ్చింది. ఆ చిలిపి పనులు కొన్నిసార్లు హద్దులు దాటుతాయి, వెగటు పుట్టిస్తాయి. కాబట్టే ‘బ్యాడెస్ట్‌ మ్యాన్‌ ఆన్‌ ది ప్లానెట్‌’ అయ్యాడు. ఆ బ్యాడెస్ట్‌ ఐరన్‌ మ్యాన్‌ ఇప్పుడు భారత సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. తెలంగాణ లైగర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు.

టైసన్‌.. టైసన్‌.. టైసన్‌.. అంటూ అభిమానుల కేరింతలు బాక్సింగ్‌ రింగ్‌ బయటే కాదు, సినిమా థియేటర్లలోనూ మార్మోగనున్నాయి. తెలంగాణ ‘లైగర్‌’ విజయ్‌ దేవరకొండతో కలిసి, ప్రపంచ బాక్సింగ్‌ టైగర్‌ మైక్‌ టైసన్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఈ ధీరుడి గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నది. టైసన్‌కు బాక్సింగ్‌ కొత్తేం కాదు. ఆ మాటకొస్తే, నటన కూడా కొత్త కాదు. దాదాపు 20 ఏండ్లు బాక్సింగ్‌ రింగ్‌లో.. కింగ్‌గా వెలుగొందాడు టైసన్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం.. రౌడీహీరో విజయ్‌ దేవరకొండ కథానాయకత్వం.. ఈ అల్టిమేట్‌ క్రేజీ కాంబినేషన్‌కి తోడు టైసన్‌ బీభత్సం! కాబట్టే, అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -

ఇండియన్‌ ఫుడ్‌కు ఫిదా!


బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌, అతని భార్య కికీ.. ఇద్దరూ భారతీయ ఆహారానికి వీరాభిమానులే. ఆ విషయం తెలియడంతో డబుల్‌ మసాలాతో భారతీయ వంటకాలను వండి వడ్డిస్తున్నారు ప్రొడక్షన్‌ టీమ్‌. టైసన్‌ మధ్యాహ్న భోజనంలో గార్లిక్‌ నాన్‌, తందూరి చికెన్‌, బటర్‌ చికెన్‌, ఫిష్‌ టిక్కా మసాలా, మటన్‌ బిర్యానీ ఇష్టంగా తింటున్నారట. ఆలూ గోబీ, సమోసా, పాలక్‌ పనీర్‌, కబాబ్‌ అడిగి మరీ చేయించుకుంటున్నారట. ఈ సినిమా ద్వారా విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు, అనన్యపాండే టాలీవుడ్‌లో కాలుపెడుతున్నది. ఇక, మైక్‌ టైసన్‌ తొలిసారిగా ఓ భారతీయ చిత్రంలో కనిపిస్తున్నాడు. లైగర్‌లో టైసన్‌ చేసేది అతిథి పాత్రే అయినా విజయ్‌ కంటే రెట్టింపు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడని బాలీవుడ్‌ వర్గాల గుసగుస. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియో గ్రాఫర్‌ ఆండీ లాంగ్‌ సారథ్యంలో స్పెషల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ డిజైన్‌ చేస్తున్నారు.

మంచి నటుడు కూడా

ప్రపంచ బాక్సింగ్‌ చరిత్రలోనే మైక్‌ టైసన్‌ ఓ సంచలనం. ఏ బాక్సర్‌ సాధించనన్ని రికార్డులను సృష్టించాడు. అయితే, 1997లో ఆవేశంతో తోటి బాక్సర్‌ హోలీఫీల్డ్‌ చెవి కొరకడంతో ఆట నుంచి సస్పెండ్‌ అయ్యాడు. కొన్ని వివాదాలు, మరికొన్ని కోర్టు కేసుల తర్వాత 2005లో బాక్సింగ్‌ను పూర్తిగా వదిలేశాడు. మొదటి నుంచీ బాక్సింగ్‌ చేస్తూనే హాలీవుడ్‌ చిత్రాల్లో నటించాడు టైసన్‌. 1990లో వచ్చిన ‘సూపర్‌స్టార్‌’ మూవీ మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత, దాదాపు 50 సినిమాల్లో నటించాడు. నిర్మాతగానూ నిరూపించుకున్నాడు. టైసన్‌ హీరోగా నటించిన
ది హ్యాంగోవర్‌ (2009), ది హ్యాంగోవర్‌ పార్ట్‌-2 (2011), ఐపీ మ్యాన్‌-3 (2015) మంచి ఆదరణ పొందాయి. ఐపీ మ్యాన్‌-3, ది హ్యాంగోవర్‌ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టాయి. టైసన్‌ ఆగమనాన్ని విజయ్‌ దేవరకొండ మాటల్లో చెప్పాలంటే..
‘ఫర్‌ ద ఫస్ట్‌ టైమ్‌ ఆన్‌
ఇండియన్‌ స్క్రీన్స్‌!
ద గాడ్‌ ఆఫ్‌ బాక్సింగ్‌.
ద లెజెండ్‌. ద బీస్ట్‌.
ద గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌!

లైగర్‌ విజయ్‌తో.. టైగర్‌ టైసన్‌

ప్రస్తుతం ఆమెరికాలోని లాస్‌వేగాస్‌లో షూటింగ్‌ జరుపుకొంటున్నది ‘లైగర్‌’. దీపావళి కానుకగా టైసన్‌ తన ఇన్‌స్టాలో పిడికిలి బిగించి, సింహగర్జన చేసే ఫొటోను విడుదల చేశారు. చిత్రంలో టైసన్‌ పాత్ర ఏమిటన్నది బయటికి పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. టైసన్‌, విజయ్‌ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని మాత్రం హాలీవుడ్‌ మీడియా కోడై కూస్తున్నది. విజయ్‌కి గురువుగా టైసన్‌ కనిపిస్తున్నాడా? ప్రత్యర్థిగా దర్శనం ఇవ్వబోతున్నాడా? ఏకంగా తండ్రి పాత్ర చేస్తున్నాడా?.. విజయ్‌ అభిమానుల్లోనూ ఇదే ప్రశ్న.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement