e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, April 13, 2021
Advertisement
Home News కలిసి పని చేద్దాం.. కేంద్రమంత్రికి పవార్‌ పిలుపు

కలిసి పని చేద్దాం.. కేంద్రమంత్రికి పవార్‌ పిలుపు

కలిసి పని చేద్దాం.. కేంద్రమంత్రికి పవార్‌ పిలుపు

ముంబై : మహారాష్ట్రలో కరోనా పరిస్థితులను మెరుగుపరిచేందుకు కలిసి పని చేద్దామని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కేంద్రమంత్రికి పిలుపునిచ్చారు. గురువారం మాట్లాడుతూ కొవిడ్‌ పరిస్థితి మహారాష్ట్రలో భయంకరంగా ఉందని, ఈ మేరకు సహాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడానని, మహారాష్ట్రతో పాటు మిగతా రాష్ట్రాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడం, క్రియాశీల కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కొన్ని కఠినమైన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య కార్యకర్తలు తమ వంతు కృషి చేస్తున్నారన్నారు. నిపుణుల సలహాల మేరకు వైరస్‌ చైన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందున్నారు.

ఇదిలా ఉండగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి బుధవారం మహారాష్ట్ర పాటు పలు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, భయాందోళనలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా టీకాల నిల్వలు నిండుకున్నాయని చేసిన ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

గంట‌కు 140 కి.మీ. వేగం.. అందుకే టైగ‌ర్‌వుడ్స్ కారుకు ప్ర‌మాదం
మీ గొంతు విని క‌రోనా ఉందో లేదో చెప్పేసే యాప్‌
యురోపియ‌న్ క‌మిష‌న్‌ అధ్య‌క్షురాలికి ఘోర అవ‌మానం.. క‌నీసం కుర్చీ వేయ‌కుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌.. రిలీజ్ ఇప్ప‌ట్లో లేన‌ట్లే అన్న స‌ల్మాన్‌
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్క‌డ వ‌ద్దు.. మ‌హా సీఎంకు వాంఖ‌డే నివాసితుల లేఖ‌
భారత్ ప్ర‌యాణికుల‌పై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మ‌ళ్లీ ద‌ర్యాప్తు చేప‌ట్టండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారుల‌కు క‌రోనా
Advertisement
కలిసి పని చేద్దాం.. కేంద్రమంత్రికి పవార్‌ పిలుపు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement