e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News 26 వరకు అసెంబ్లీ

26 వరకు అసెంబ్లీ

  • ప్రజా సమస్యలపై ఎన్నిగంటలైనా చర్చిద్దాం:మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 15 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగనున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీ సమావేశం లో ఎజెండాను ఖరారు చేశారు. శాసనమండలి సమావేశాలు కూడా 26 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ పది రోజులు, మండలి ఆరు రోజులు జరుగనున్నది. సభ్యులందరూ చర్చల్లో పాల్గొనేలా పని గంటలు పెంచి, సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పార్టీలకు మాట్లాడే సమయం కేటాయిస్తామని స్పీకర్‌ పోచారం చెప్పారు. 

ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించడానికి, ఎన్ని గం టలైనా సభను నడిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నం, బడ్జెట్‌పై జరిగే చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఉంటుందని, వారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌ గొంగిడి సునీత, ఎంఐఎం పార్టీ తరఫున పాషా ఖాద్రి, కాంగ్రెస్‌ ప్రతినిధి మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.

మండలిలో ఆరు పనిదినాలు

- Advertisement -

శాసనమండలిలో కూడా చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఆరు పనిదినాలు మండలిని నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారంతో కలుపుకొని 17, 18, 20, 22, 26 తేదీల్లో మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ నేతి వి ద్యాసాగర్‌, శాసనసభ వ్యవహారాలశాఖ మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, చీఫ్‌ విప్‌ బీ వెంకటేశ్వర్లు, విప్‌ భానుప్రసాద్‌, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, ఎంఐ ఎం ప్రతినిధి జాఫ్రీ, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ  నరసింహాచార్యులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement