స్కాట్ ఆడికిన్స్, అన్నా బత్కెవిచ్, యూలి యా ముఖ్య తారాగణంగా ఆండ్రియన్ బోల్ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెగసి ఆఫ్ లైస్’. ప్రైమ్ ఒరిజినల్స్ సమర్పణలో , నెట్ 5 డిజిటల్ భాగస్వామ్యంతో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాన్ని ‘ఏజెంట్ ఎమ్-6’గా హిందీలో విడుదల చేస్తున్నారు. తమ సంస్థలో ఎంపిక చేసిన హాలీవుడ్ సినిమాలను కొన్ని చిత్రాలు ప్రధాన భారతీయ భాషలన్నింటిలో అనువదించి ఇక్కడి ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఓటీటీ కంటే ముందే థియేటర్లో కూడా విడుదల చేస్తున్నామని నెట్ 5సీఇవో బల్వంత్ సింగ్ తెలిపారు.