అందాల రాక్షసి సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). రీసెంట్గా లీడ్ రోల్లో హ్యాపీ బర్త్ డే సినిమాతో అందరినీ పలుకరించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ఈ భామ ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలనే కసితో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుంది.
ఇంతకీ ప్రాక్టీస్ సెషన్ ఏంటీ అనుకుంటున్నారా..? నెక్ట్స్ ప్రాజెక్టులో వచ్చే ఫైట్ సీన్ (fight scene)కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్చేసింది. అభ్యాసం మిమ్మల్ని పరిపూర్ణవంతుల్ని చేస్తుంది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లావణ్య ప్రాక్టీస్ సెషన్ వీడియోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాఠి ప్రస్తుతం జీ5 థ్రిల్లర్ వెబ్ సిరీస్ పులి మేక (Puli Meka )లో నటిస్తోండగా..ఆదిసాయికుమార్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతుంది.