హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): మీరు చేసే సరికొత్త ఆవిష్కరణలు భారతదేశ రక్షణ రంగాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేలా ఉన్నాయా… మీలాంటి వారికోసమే ఐఐటీ హైదరాబాద్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్, ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్)లతో కలిసి టీహబ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇన్నోవేటింగ్ అండ్ మోడ్రనైజింగ్ ఇండియాస్ డిఫెన్స్ టెక్నాలజీ అనే అంశంపై ఐడెక్స్ రోడ్‌షో-2022ను నిర్వహిస్తున్నారు.
రక్షణ రంగంలో ఉన్న అవకాశాలను స్టార్టప్‌లకు అందించేందుకు ఐడెక్స్ డిస్క్6, ఐడెక్స్ ప్రైమ్ పేరుతో రెండు అంశాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 14న నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంపికైన స్టార్టప్‌లకు రూ.1.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆర్థికసాయం అందిస్తారని, ఆసక్తి ఉన్నవారు https://bit. ly/3KRrZwn. లింక్‌లో సంప్రదించాలని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు.