Latent View IPO | డేటా అనలిటిక్స్ సర్వీసెస్ కంపెనీ లాటెంట్ వ్యూ అనలిటిక్స్ సైతం ఐపీవోలో రికార్డులు నెలకొల్పింది. లాటెంట్ వ్యూ అనలిటిక్స్ ప్రతిపాదిత షేర్లకు శుక్రవారంతో ముగిసిన ఆఫర్లలో రికార్డు స్థాయిలో 338 రెట్లు సబ్స్క్రిప్షన్లు నమోదయ్యాయి. 572.18 కోట్ల షేర్లకు రూ.1.12 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. డేటా అనలిటిక్స్ 1.75 కోట్ల షేర్లు తన తొలి ఐపీవో ఆఫర్లో విక్రయించింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లు 850.66 రెట్ల సబ్స్క్రిప్షన్లు నమోదయ్యాయి.
బీఎస్ఈ డేటా ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లు 119 రెట్లు బిడ్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. బుధవారం మొదలైన సబ్స్క్రిప్షన్ కేవలం 45 నిమిషాల్లోనే ముగిసింది. ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లు 145.48 రెట్లు బిడ్లు పొందాయి. లాటెంట్ వ్యూ అనలిటిక్స్ 15 ఏండ్లుగా డేటా, అనలిటిక్స్, కన్సల్టింగ్ టు బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్, డేటా ఇంజినీరింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ సేవలందిస్తున్నది.