langur | నిత్యం తమ ఆలనా పాలనా చూసుకునే ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతారు. శోకసంద్రంలో మునిగిపోతారు. వారి రోదనలు అందరి హృదయాలను కలిచివేస్తాయి. అలానే ఓ కొండెంగ కూడా చలించిపోయింది. కన్నీరు పెట్టుకుంది. బరువైన హృదయంతో ఆ మృతదేహం వద్ద రోదించింది. ముద్దు పెట్టుకుంది. పైకి లే అంటూ చేతి పట్టుకొని కదిపింది. ఇదే కదా అభిమానం అంటే.. ఆ వీడియోను చూస్తే మన హృదయం కూడా బరువెక్కాల్సిందే.
శ్రీలంకలోని బాటికాలోయలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ఆ వ్యక్తి మృతదేహాన్ని ఇంటి బయటకుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. బంధువులు వచ్చి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నారు. అంతలోనే ఓ కొండెంగ కూడా అక్కడకు వచ్చింది. మృతదేహం వద్ద చేరుకుని ముఖంపై ముద్దు పెట్టింది. చేయి పట్టుకుని లేపేందుకు ప్రయత్నించింది. అక్కడున్న వారు దాన్ని పంపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ కొండెంగ వెళ్లలేదు. తనకు నిత్యం అన్నం పెట్టే వ్యక్తి చనిపోయాడు కదా అని విలపించింది ఆ కొండెంగ.
ఆ జంతువు బాధను చూసి అక్కడున్న వారంతా మరింత భావోద్వేగాలకు లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొండెంగ ప్రేమ, అభిమానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని జంతువులు మానవులను విశ్వసిస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొంటున్నారు.
A monkey paying tribute at the #funeral of its master in #Batticaloa.#truelove. pic.twitter.com/Yf3XjRYXwc
— Aslaw CC (@effay123) October 19, 2022