బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈచిత్రంలో అక్కినేని హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కరీనా కపూర్ కథానాయిక. అద్వైత్ చందన్ ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా తెరకెక్కిస్తున్నాడు. దేశంలోని పలు ప్రాంతాలలో మూవీ చిత్రీకరణ జరుపుకుంది. ఆ మధ్య ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో కూడా జరిగింది.
దేశంలో వందకు పైగా లొకేషన్స్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరగగా, ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్టు మేకర్స్ తెలియజేశారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా సెట్లో చిత్రబృందం కేక్ కట్ చేసి సెలబ్రెట్ చేసుకున్నారు.
లాక్డౌన్ పరిస్థితుల వల్ల చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా రపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.