నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. ఉషా ముల్పూరి నిర్మాత. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. ఈ నెల 23న సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ పాటను మహతి స్వరసాగర్ సంగీతంలో కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా రామ్ మిరియాల పాడారు. ప్రేమతో ఇరకాటంలో పడిన కథానాయకుడు అటు కుటుంబంతోనూ చిక్కులు ఎదుర్కొవడం ఈ పాటలో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ పాట చిత్రానికి ఆకర్షణ అవుతుందని చిత్ర బృందం చెబుతున్నారు.