ధర్మారం, మే24 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తాటి వనాలు కాలిపోయిన నేపథ్యంలో గీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం ధర్మారం శివారులోని సలాంద్రి సమీపాన ఉన్న తాటి వనాలు అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న ఈశ్వర్ ఆదివారం కాలిన తాటి వనాలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఎకరాలలోని తాటివనాలు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం బాధాకరమన్నారు.
తాటి వనాలు కాలిపోవడంతోస్థానిక గీత కార్మికులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు తగిన పరిహారం అందజేసి కాలిపోయిన తాటి వనాల స్థానంలో కొత్త వనాలను పెంచాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గీత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉందని మాజీ సీఎం కేసీఆర్ 5 కోట్ల తాటివనాలను పెంచారని ఈశ్వర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఈశ్వర్ వెంట నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ ధర్మారం పట్టణ తాజా మాజీ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు, నాడెం శ్రీనివాస్, గాజుల రాజు, ఆవుల లత, కాంపల్లి అపర్ణ, గుజ్జేటి కనక లక్ష్మి, మార్క సంధ్య తదితరులు పాల్గొన్నారు.