e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News అంబరాన్నంటిన హోలీ వేడుకలు

అంబరాన్నంటిన హోలీ వేడుకలు

రంగులు చల్లుకుంటూ ఆడిపాటిన చిన్నాపెద్దా..
అలరించిన కాముని దహన వేడుకలు

దండేపల్లి, మార్చి 28 : దండేపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో హోలీ వేడుకలు ఆదివారం అంబరాన్నంటా యి. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల అనంతరం సమీప గోదావరికి, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి స్నానాలు చేశారు.
ఊరూవాడా హోరెత్తిన వేడుకలు
తాండూర్‌, మార్చి 28 : మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ వేడుకలను ఆదివారం ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునుంచే యువకులు, చిన్నారులు, మ హిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టా రు. గ్రామాల్లోని రహదారులన్నీ రంగులతో నిండిపోయాయి. ఐబీలో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. మా దారం కార్మిక క్షేత్రంలో యువకులు, కార్మికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు జాజిరి పాటలు పాడారు.
వేమనపల్లి, మార్చి 28 : మండలంలో ఆదివారం హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే యువకులు, చిన్నారులు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. ఇండ్లలో విందుభోజనాలు ఆరగించారు. ఎటు చూసినా రంగు ల సందడే కనిపించింది.
జన్నారం, మార్చి 28 : హోలీ సందర్భంగా మండల కేంద్రంలో యువకులు, నాయకులు రంగులు పూసుకొని వేడుకలు నిర్వహించారు. గ్రామాల్లో చిన్నాపెద్దా తారతమ్యం లేకుం డా రంగులు చల్లుకున్నారు. జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, కోఆప్షన్‌ సభ్యుడు మున్వర్‌అలీఖాన్‌, ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా హోలీ..
హాజీపూర్‌, మార్చి 28 : హాజీపూర్‌ మండలంలో హోలీ పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని పలు గ్రామాల్లో చిన్నారులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆనందోత్సవాల మధ్య పండుగను నిర్వహించుకున్నారు.
కోటపల్లి, మార్చి 28 : కోటపల్లి మండలంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వేడుకలకు చాలా మంది దూరంగా ఉన్నారు. చిన్న పిల్లలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు నిర్వహించారు.
సీసీసీ నస్పూర్‌, మార్చి 28 : సీసీసీ నస్పూర్‌లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వేడుకల్లో మునిగితేలారు.
అలరించిన కాముని దహనం, హోలీ వేడుకలు..
కాసిపేట, మార్చి 28 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు, పిల్లలు, పెద్దలు, మహిళలు తేడా లేకుండా రంగులు చల్లుకున్నారు. కొన్ని గ్రామాల్లో సోమవారం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం రాత్రి కాముని దహ నం చేశారు. ఇతర గ్రామస్తులు కాముని బూడిదను దొంగిలించే ప్రయత్నం చేయడం ఆదివాసుల ఆచారంలో భాగమని, అందుకే గ్రామంలోని పురుషులందరూ బూడిదకు రక్షణగా రాత్రంతా జాగరణ చేశారని పెద్దలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement