e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News ట‌క్ జ‌గ‌దీష్ నుండి కోలో కోల‌న్న కోలో సాంగ్ విడుద‌ల‌

ట‌క్ జ‌గ‌దీష్ నుండి కోలో కోల‌న్న కోలో సాంగ్ విడుద‌ల‌

ట‌క్ జ‌గ‌దీష్ నుండి కోలో కోల‌న్న కోలో సాంగ్ విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వ‌ల‌న కాస్త సైలెంట్ అయిన నాని ప్ర‌స్తుతం ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో పాటు శ్యామ్ సింగ రాయ్, అంటే సుంద‌రానికి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 23న ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను విడుదల చేశారు.

‘నిన్ను కోరి’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం ‘టక్ జగదీష్‌. తాజాగా ఈ సినిమా నుండి కోలో కోల‌మ్మ కోలో అనే సాంగ్ విడుద‌ల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. అమ్రాన్ మాలిక్, హరిణి దీన్ని ఆలపించారు. ఈ సాంగ్‌లో ఫ్యామిలీ అంతా క‌లిసి సంద‌డి చేస్తుండ‌డం చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంది.   షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ  క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు.  జగపతిబాబు, రావు రమేష్, నరేష్ సహా ఎంతో మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట‌క్ జ‌గ‌దీష్ నుండి కోలో కోల‌న్న కోలో సాంగ్ విడుద‌ల‌

ట్రెండింగ్‌

Advertisement