టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా సినిమా సమ్మతమే (Sammathame). గోపీనాథ్ రెడ్డి (Gopinath Reddy) డైరెక్షన్ చేస్తున్నాడు. ఇవాళ సమ్మతమే ట్రైలర్ ను మంత్రి కేటీఆర్ లాంఛ్ చేశారు.
‘ఏ ఇంటికైనా ఆడపల్లే మహాలక్ష్మి వాళ్లు లేని ఇల్లు ఇలానే ఉంటుంది అని తండ్రి అంటుంటే..అయితే నాకు పెళ్లి చేసేయి నాన్న.చెప్పు నాకు ఏ క్లాస్‌లో పెళ్లి చేస్తావ్.. ‘అంటూ కొడుకు చెబుతున్న సంభాషణలతో మొదలైంది ట్రైలర్. ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ తో సాగే ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు దర్శకుడు. కిరణ్, చాందిని మధ్య ఫన్నీగా సాగుతున్న లవ్ ట్రాక్ఎలాంటి యూ టర్న్ తీసుకుందో సస్పెన్స్ పెడుతూ..కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ అయినా చాలా బాగా చేశారు. ఈనెల 24న సినిమా రిలీజవుతోంది. అందరూ థియేటర్లకు వెళ్లి, సినిమా చూసి ఆదరించండి. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ అన్నారు.
హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ..సమ్మతమే ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఇలాంటివి చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకున్నవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. నా మనసుకి నచ్చి చేసిన క్యారెక్టర్స్ మాత్రం వర్కౌట్ అయ్యాయి. ఈ స్టోరీ వినగానే నా మనసుకి ఇది చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి సినిమా అనిపించింది. అందుకే వెంటనే అంగీకరించాను. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..ట్రైలర్ లాంచ్ చేసిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు. మీకు ట్రైలర్ నచ్చిందని చెప్పడం, కొత్తవాళ్ళు రావాలని మీరు ఎంకరేజింగ్ గా మాట్లాడటం ఆనందంగా ఉంది. మా సినిమా నచ్చి, ఈ సినిమాని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సాయం చేస్తున్న అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి ధన్యవాదాలు. సమ్మతమే ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. సినిమా గురించి ఇక చెప్పడాలు ఏం లేవు. సినిమా పట్ల మేం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. జూన్ 24 న అన్నింటికీ మీతో సమ్మతమే అని మేం చెప్పిస్తాం. ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు..అన్నారు.
డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ..మాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి అనే చిన్న ఊరు. నా చిన్నతనంలో మా ఊళ్లో సినిమా చూడాలంటే అది రెండోసారి రిలీజవ్వాలి. అంటే సినిమా రిలీజైన మూడు నాలుగు నెలలకు కానీ అది మా ఊరికి వచ్చేది కాదు. అలాంటి ఊరి నుంచి వచ్చిన మాలాంటి వాళ్లకు సపోర్ట్ చేయడానికి వచ్చిన కేటీఆర్ గారికి చాలా థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర రాత్రి 9.30కు ఈ ట్రైలర్‌కు ఆర్ఆర్ స్టార్ట్ చేస్తే, ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకు పూర్తయింది. మార్నింగ్ ఫైనల్ మిక్స్ చేశాం. అంతగా కష్టపడ్డారు. డీవోపీ సతీశ్‌రెడ్డి చాలా సపోర్ట్ చేశారు. హీరోయిన్ చాందిని గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. సినిమా గీతా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రిలీజవుతోంది. హీరో కిరణ్ అన్న వల్లే ఓటీటీ బిజినెస్ కూడా క్లోజ్ అయ్యింది. తను దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. తనకూ, నాకూ మొదట్నుంచీ మంచి రాపో కుదిరింది.” అని చెప్పారు.
నిర్మాత కంకణాల ప్రవీణ మాట్లాడుతూ..మా అబ్బాయి చిన్నప్పుడు సినిమాకి పోతా అని ఏడ్చేవాడు, ఇప్పుడు ఏకంగా సినిమానే తీశాడు. ఈ మూవీకి పనిచేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనెల 24న ఈ సినిమాని చూసిన వాళ్లందరూ ‘సమ్మతమే’ అంటారని ఆశిస్తున్నాను. అందరూ అలాగే అనాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో వెళ్లి చూడాల్సిన చిత్రం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ నచ్చుతుంది. మీరందరూ వచ్చి, సినిమా చూసి సమ్మతమే అని మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను.” అని అన్నారు.
జూన్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్.
తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ
బ్యానర్: యూజీ ప్రొడక్షన్స్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: విల్పవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్‌కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్‌లో స్టిల్