కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘సమ్మతమే’. చాందినీ చౌదరి నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత ప్రవీణ మాట్లాడుతూ..‘మా చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో అల్లు అరవింద్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఓ కొత్త ప్రేమ కథగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. దర్శకుడు గోపీనాథ్ సకుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దారు. ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వస్తున్నది. కిరణ్ అబ్బవరం కెరీర్లో మంచి సినిమాగా మిగులుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సతీష్ రెడ్డి మాసం, సంగీతం : శేఖర్ చంద్ర.