Nenu Meeku Baga Kavalsinavadini 3rd Single | విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ‘సెబాస్టియన్’తో నిరాశపరిచిన ఇటీవలే విడుదలైన ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మాస్ బీట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అట్టాంటి ఇట్టాంటి అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. స్వర మాంత్రికుడు మణిశర్మ చాలా రోజుల తర్వాత మంచి పెప్పి సాంగ్‌ను కంపోజ్ చేశాడు. కిరణ్ అబ్బవరం స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సాకేత్, కీర్తన శర్మ ఆలపించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన నచ్చావ్ అబ్బాయ్, లాయర్ పాప పాటలకు విశేష స్పందన వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య, దీప్తి నిర్మిస్తున్నారు.