King Snake | పాములకు తెలివి ఉంటుందా? అంటే ఈ పామును చూసిన తర్వాత ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే పాములు నున్నగా ఉన్న గోడల పైకి ఎక్కలేవు. ఎక్కినా కూడా కొద్ది దూరం మాత్రమే వెళ్లగలుగుతాయి. ఆ తర్వాత కిందకు పడిపోతాయి. కానీ ఈ పాము తెలివిగా గోడను ఎక్కేసింది. పాము తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను చూస్తుంటే నోకియా ఫోన్లో ఉన్న స్నేక్ గేమ్ గుర్తొస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
అరిజోనాలోని కోరోనాడో నేషనల్ మెమోరియల్ పార్కులో.. సోనోరన్ మౌంటెన్ కింగ్ స్నేక్ గోడపైకి ఎక్కింది. ఎలా అంటే.. ఇటుకల మధ్య ఉన్న స్థలాన్ని బేస్ చేసుకొని.. ఆ పాము అలా పైకి ఎక్కేసింది. ఈ దృశ్యాన్ని పార్కు సిబ్బంది కెమెరాల్లో చిత్రీకరించి, ఫేస్బుక్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.