సత్తుపల్లి, అక్టోబర్ 5 : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ శివార్లలోని సరస్వతి ఆలయంలో బుధవారం అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 5 : దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని భక్తులు బుధవారం పలు ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలపరిధిలోని రేజర్ల గుట్టపై వెలిసిన కనకదుర్గా దేవికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించగా అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు.
ఎర్రబోయినపల్లిలో ఎమ్మెల్యే పూజలు
కల్లూరు రూరల్, అక్టోబర్ 5 : పలు గ్రామాల్లో భక్తుల నుంచి ఘనంగా పూజలు అందుకున్న అమ్మవారి ఉత్సవాలు బుధవారంతో ముగిసాయి. మండల పరిధిలోని ఎర్రబోయినపల్లి, చండ్రుపట్ల, పుల్లయ్యబంజర, పడమటి లోకవరం, చిన్నకోరుకొండి, ముచ్చవరం, తాళ్లూరు వెంకటాపురం, పెద్దకోరుకొండి గ్రామాల్లో దేవీనవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎర్రబోయినపల్లిలో నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పోట్రు ప్రవీణ్ ఎమ్మెల్యే సండ్రకు శ్రీవేంకటేశ్వరస్వామి ఫోటోను అందజేశారు.