ప్రభాస్ తర్వాత పాన్ ఇండియన్ హీరో ఎవరు అంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి యశ్ నేనున్నాను అంటూ వచ్చాడు. కెజియఫ్ సినిమా తర్వాత ఈయన రేంజ్ మారిపోయింది. ఈయనతో సినిమాలు చేయడానికి అన్ని ఇండస్ట్రీల్లోని నిర్మాతలు పోటీ పడుతున్నారు. దర్శకులు కూడా చాలా మంది కథలు సిద్ధం చేస్తున్నారు. కెజియఫ్ 2 సినిమా కూడా పూర్తి కావడంతో యశ్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేసాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి దారిలో అయితే వెళ్ళాడో.. ఇప్పుడు యశ్ కూడా అదే చేయబోతున్నాడు. కెజియఫ్ ఊహించని విజయం సాధించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వరకు వసూలు చేస్తే.. అందులో కన్నడలోనే 100 కోట్లకు పైగా వచ్చాయి. ఎవరూ ఊహించని రీతిలో కెజియఫ్ వసూళ్ల సంచలనం సృష్టించడంతో యశ్ పేరు దేశమంతా మార్మోగిపోయింది.
కథలోని దమ్ము తెలిసి కెజియఫ్ ను అన్ని భాషల్లో విడుదల చేసారు. ఇప్పుడు ఛాప్టర్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే కెజియఫ్ తర్వాత యశ్ కోసం చాలా మంది దర్శకులు కథలు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగులో కూడా పూరీ జగన్నాథ్ సహా కొందరు అగ్ర దర్శకులు కూడా కథలు రాసుకున్నారు. యశ్ ఊ అంటే హిందీలో కూడా లాంఛ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతగా చేసినా కూడా ఇప్పుడు యశ్ తీసుకుంటున్న నిర్ణయం మాత్రం ఆశ్చర్యపరుస్తుంది. కెజియఫ్ లాంటి సంచలన సినిమా తర్వాత వెంటనే మరో అగ్ర దర్శకుడితో సినిమా చేస్తే అంచనాలు మామూలుగా ఉండవు. వాటిని రీచ్ కావడం కష్టమే. అందుకే ప్రభాస్ రూట్ నే ఇప్పుడు ఫాలో అవుతున్నాడు.
బాహుబలి లాంటి సినిమా తర్వాత చాలా మంది దర్శకులు వచ్చినా కూడా సాహోతో సుజీత్ కు ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. ఇప్పుడు యశ్ కూడా మరోసారి లోకల్ దర్శకుడినే నమ్ముకుంటున్నాడు. ఎందరో అగ్ర దర్శకులు కథలు వినిపించినా కూడా కన్నడలో ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు నార్తాన్కు అవకాశం ఇచ్చాడు యశ్. ఈయన కూడా ప్రశాంత్ నీల్ మాదిరే పక్కా మాస్ డైరెక్టర్. కెజియఫ్ కు ముందు ఉగ్రం అనే ఒక్క సినిమా అనుభవం మాత్రమే ప్రశాంత్‌కు ఉంది. ఇప్పుడు నార్తన్ కు కూడా అంతే. ఈయన మఫ్టీ అనే సినిమా చేసాడు. పైగా ప్రశాంత్ నీల్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు నార్తాన్. ఆయన చెప్పిన కథ నచ్చి యశ్ అవకాశం ఇచ్చాడు. ఏదేమైనా చిన్న దర్శకుడికి అవకాశం ఇస్తే అంచనాలు కూడా కాస్త తక్కువగానే ఉంటాయి. అదే సేఫ్ అంటున్నాడు కెజియఫ్ స్టార్.
ఇవి కూడా చదవండి..
‘మీట్ క్యూట్’ లో ఐదుగురు హీరోయిన్లు..?
కల్యాణం పాట విడుదల చేసిన సమంత
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!