బాహుబలి సినిమా తర్వాత సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మన సినిమాలపై నార్త్ మేకర్సే కాకుండా ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ కూడా దృష్టిసారిస్తున్నారు. అభిమానులు సైతం మన సినిమా రిలీజ్ అయిందో లేదో థియేటర్ బాట పడుతున్నారు. బాహుబలి తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన మరో చిత్రం కేజీఎఫ్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రూపొందగా, జూలై 16న ఈ మూవీని థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు.
కేజీఎఫ్ క్రియేట్ చేసిన బజ్‌తో కేజీఎఫ్ 2 చిత్రానికి విదేశాలలో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కొందరు సినీ ప్రేమికులు అయితే కేజీఎఫ్ 2 పేరుని వాహనాలపైన రాసుకుంటున్నారు. ఓ లారీ యజమాని తన లారీ వెనుక భాగంలో కేజీఎఫ్ 2 త్వరలో అంటూ స్టిక్టర్ వేయించాడు. ఇది చూసిన కేజీఎఫ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లో ఇండియన్ సినిమాలు క్రమం తప్పకుండా విడుదల అవుతుంటాయి అనే విషయం తెలిసిందే.