హైదరాబాద్ : తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10న లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మెగా బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూకే జాగృతి నాయకులను ఎమ్మెల్సీ అభినందించారు. ఈ వేడుకల్లో యూకే తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా చేనేత చీరలను అందించనున్నామని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షుడు సుమన్ బల్మూరి పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రాష్ట్ర కార్యదర్శి రోహిత్‌రావు, నాయకులు ప్రశాంత్ పూస, నితిశ్, రోహిత్ రావ్, దినేశ్‌రెడ్డి, అనుషా దుర్గా, జితూ, రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.