బాలీవుడ్ యువహీరో విక్కీకౌశల్తో తన ప్రేమాయణాన్ని పెళ్లిపీటల మీదకు తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉంది అందాలభామ కత్రినాకైఫ్. గతం తాలూకు విఫల ప్రేమల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త ప్రణయాన్ని గెలుపుతీరం వైపుకు నడిపించాలనే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ జంట గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలొచ్చాయి. వీటిని విక్కీకౌశల్ సోదరుడు సన్నీకౌశల్ కొట్టిపడేశారు. తాజాగా విక్కీకౌశల్ నటించిన ‘సర్దార్ ఉద్ధమ్’ చిత్ర ప్రమోషన్స్‌కు కత్రినాకైఫ్ హాజరైంది. ఈ సందర్భంగా పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారని విక్కీకౌశల్ను విలేఖరులు ప్రశ్నించగా..సరైన ముహూర్తం చూసి త్వరలో నిశ్చితార్థం చేసుకుంటామని ఆయన తెలిపారు. తన ఎంగేజ్మెంట్పై అనవసర ప్రచారాలు వొద్దని, తానే స్వయంగా అందరికి ఆ విషయాన్ని చేరవేస్తానని విక్కీకౌశల్ స్పష్టం చేశారు. ఆయన మాటలతో ఈ జంట ఈ ఏడాదే పెళ్లిపీటలెక్కడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.