Karthikeya-2 Movie | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘కార్తికేయ-2’ హవానే కనిపిస్తుంది. ఎన్నో వాయిదాల తర్వాత గతవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. మొదటి రోజు లిమిటెడ్ స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపయింది. ఇక ఫస్ట్‌డేకు మించిన కలెక్షన్లను సెకండ్ డే సాధించి.. కంటెంట్ ఉంటే కలెక్షన్లకు అడ్డేది అని నిరూపించింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్లో రోజు రోజుకు కార్తికేయ-2పై క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ థియేటర్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.
కార్తికేయ-2 చిత్రం బాలీవుడ్లో మొదటి రోజు కేవలం 60 స్క్రీన్లలో విడుదలైంది. ఇక రెండో రోజు ఏకంగా 300 స్క్రీన్లు పెరిగాయి. మూడో రోజు ఈ సంఖ్య మరింత పెరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. పోటీగా అమీర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ వంటి సినిమాలున్నా బాలీవుడ్ ఆడియెన్స్ కార్తికేయ-2 చిత్రం వైపే మొగ్గు చూపుతున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను భాషతో సంబంధంలేకుండా ప్రేక్షకులు ఆధరిస్తారని కార్తికేయ-2 మరోసారి నిరూపించింది. అసలు ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే ఈ చిత్రానికి హిందీ బెల్ట్‌లో ఈ స్థాయి క్రేజ్ వచ్చిందంటే విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రంతో హీరో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. రెండు రోజుల్లో ఈ చిత్రం దాదాపు 80 శాతానికి పైగానే వసూళ్ళు సాధించి బ్రేక్ ఈవెన్‌కు అడుగు దూరంలో ఉంది.