కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన ‘పటాస్’చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు అనిల్ రావిపూడి. ఏడేళ్ల ప్రయాణంలో అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగారు. ఇటీవలే ‘ఎఫ్-3’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలావుండగా కల్యాణ్‌రామ్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో రెండో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. దర్శకుడిగా తనకు తొలి సినిమా అవకాశాన్నిచ్చిన కల్యాణ్‌రామ్ కోసం అనిల్ రావిపూడి ఓ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ను సిద్ధం చేశారని, కథలోని కొత్తదనం నచ్చడంతో ఈ సినిమాకు కల్యాణ్‌రామ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలో ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.