న్యూఢిల్లీ: భార త ఫుట్బాల్ సమా ఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నూతన అధ్యక్షుడి గా కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యాడు. దీంతో 85 ఏళ్ల సమాఖ్య చరిత్రలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి మాజీ క్రీడాకారుడిగా చౌబే రికార్డు సృష్టించాడు. చౌబే తన ప్రత్యర్థి బైచుంగ్ భూటియాపై 33-1 తేడాతో ఘన విజయం సాధించాడు.
34 మంది ఓటింగ్ చేసిన ఎన్నికలలో భూటియాకు కేవలం తన ఒక్క ఓటు మాత్రమే దక్కడం గమనార్హం. కాగా అధ్యక్షుడిగా ఎన్నికైన చౌబేకు భూటియా శుభాకాంక్షలు తెలిపి, ఫుట్బాల్ ప్రగతికి ఇకపై కూడా తన సహకారం ఉంటుందన్నాడు.