ఈ రోజు కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు గోపికల్లా మారుతుంటే చిన్నారులని కృష్ణుడిలా మర్చి పండుగ చేసుకుంటున్నారు. కృష్ణాష్టమి పండుగను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటుండగా, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ వేడుకని తన ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.
కాజల్ తాజాగా తన సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ట్రెడిషనల్ లుక్‌లో ఫ్లూట్ పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మని చూసి అభిమానులు తన్మయత్వం చెందుతున్నారు. గోపికమ్మమాదిరిగా కాజల్ భలే క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. వివాహం అయిన తరువాత తొలిసారిగా హర్యాలీ తీజ్ వేడుకను జరుపుకున్న కాజల్ అందుకు సంబంధించిన పిక్స్ ఇటీవల షేర్చేసిన విషయం తెలిసిందే.
ఇక భర్తతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మస్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్బికినీతో దర్శనమిచ్చి ఆశ్చర్యపరచింది. పెళ్లి తర్వాత కాజల్ ఇంత హాట్‌గా కనిపించడంతో అందరు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆచార్య,భారతీయుడు 2, ఉమ, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఘోస్ట్ అనే సినిమాలతో బిజీగా ఉంది.