ప్రెగ్నెంట్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లవ్ లీ ఫొటోను షేర్ చేయగా..ఇపుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాజల్‌కు ఇది చాలా స్పెషల్ స్టిల్. అంత స్పెషల్ ఏంటనుకుంటున్నారా..? ఈ ఫొటో తీసింది భర్త గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu) కావడంతో హ్యాపీ మూడ్‌లో కనిపిస్తోంది. కాజల్ తన మొదటి బిడ్డ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తుందని తాజా ఫొటో చూస్తే తెలిసిపోతుంది. కాజల్ డెనిమ్ జాకెట్, వైట్ టీ షర్ట్, లెగింగ్స్, వైట్ స్నీకర్స్ సోఫాలో చాలా కంఫర్టబుల్‌గా కూర్చొని చేతిలో టీ కప్పు పట్టుకుని చిరునవ్వుచిందిస్తూ కనిపిస్తోంది.
లేటెస్ట్ స్టిల్‌లో కాజల్ కొత్త హెయిర్ స్టైల్లో కనిపిస్తుండటం విశేషం. రుతువులు మారతాయి..నేను కూడా అలాగే కొత్త ఆకుని…??? అంటూ కిచ్లూను ట్యాగ్ చేస్తూ రెడ్ హర్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం ఇంటర్ నెట్లో చక్కర్లు కొడుతుండగా..రూ.3 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. సమంత ఈ పోస్ట్‌పై కామెంట్ చేస్తూ రెడ్ హర్ట్ ఎమోజీలను పెట్టింది. కాజల్-గౌతమ్ కిచ్లూ 2020 అక్టోబర్‌లో ముంబైలో ఫ్యామిలీ, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య(Acharya)లో కాజల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. దీంతోపాటు తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఓ సినిమా చేస్తుండగా..ఇవన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.