తమ ఇంట్లోకి రానున్న కొత్త వ్యక్తి కోసం ఎన్నో నెలలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)- గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu ) దంపతుల కల నెలవేరింది. కాజల్ ఇంట బుడతడు అడుగుపెట్టాడు. ఏప్రిల్ 19న (నేడు)కాజల్ పండంటి మగబిడ్డ (baby boy)కు జన్మనిచ్చిందని తెలుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవాళే ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ క్యూట్ చిన్నారిని అందరికీ ఎప్పుడు పరిచయం చేస్తారని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫాలోవర్లు, నెటిజన్లు, అభిమానులు. కాజల్ ప్రెగ్నెన్సీ కాన్ఫామ్ అయిన తర్వాత ఎప్పుడూ నెటిజన్లకు టచ్‌లో ఉంటూ..తల్లి కాబోయే క్షణాలను ఆస్వాదిస్తూ హ్యాపీ మూడ్‌కు సంబంధించిన స్టిల్స్ ను అందరితో పంచుకుంది.
అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అదిరిపోయే ఫొటోషూట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. గౌతమ్ కిచ్లూ -కాజల్ దంపతులు సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.