సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది కలువ కళ్ల సుందరి కాజల్ (Kajal). కొడుకు పుట్టిన తర్వాత రీసెంట్గా మళ్లీ చాలా కాలానికి సెట్స్ లో జాయిన్ అయినట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ 2 (Indian 2) సినిమా చేస్తోంది కాజల్ అగర్వాల్.
ఏపీలోని తిరుపతిలో ఇండియన్ 2 షూటింగ్ కొనసాగుతోంది. కాగా షూటింగ్ నుంచి కాజల్‌కు బ్రేక్ దొరికినట్టుంది. పాపులర్ చార్ట్ బస్టర్ శ్రీలంకన్ సాంగ్ మనికే మగె హితే (Manike Mage Hithe) సాంగ్‌ను సిద్దార్థ్ మల్హోత్రా నటించిన థ్యాంక్ గాడ్ చిత్రంలో వాడారు. ఈ సాంగ్ హిందీ ట్రాక్‌కు స్టైలిష్ డ్యాన్స్ తో అదరగొట్టేసింది కాజల్. ఇపుడీ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
హిట్ ట్రాక్‌కు సింపుల్ డ్యాన్స్‌తో అలరిస్తున్న కాజల్ వీడియోకు ఇంప్రెస్ అయిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఆమెలో జోష్ నింపుతున్నారు. ఇండియన్ 2 కోసం కాజల్ పురాతన కాలం నాటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్టు టాక్.
శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్, రెడీ జియాంట్ మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కాజల్ ఖాతాలో ఉమా అనే మరో ప్రాజెక్టు కూడా ఉంది.