e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News 'ఇండియ‌న్ 2' పై కాజ‌ల్ క్లారిటీ

‘ఇండియ‌న్ 2’ పై కాజ‌ల్ క్లారిటీ

'ఇండియ‌న్ 2' పై కాజ‌ల్ క్లారిటీ

ప్ర‌ముఖ హీరో క‌మ‌ల్‌హాస‌న్ తో టాలీవుడ్ క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండియ‌న్ 2 సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఏర్ప‌డ‌టంతో షూటింగ్ నిలిచిపోయింది. షూటింగ్ లొకేష‌న్ లో ప్ర‌మాద‌వ‌శాత్తు క్రేన్ కుప్ప‌కూలి యూనిట్ మెంబ‌ర్స్ చ‌నిపోవ‌డంతో చిత్రీక‌ర‌ణ ఆగిపోయింది. ఆ త‌ర్వాత క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డంతో సినిమా అట‌కెక్కింది.

మ‌ళ్లీ ఇండియ‌న్ 2 ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంద‌నే దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ 2పై కాజ‌ల్ క్లారిటీ ఇచ్చిది. మోస‌గాళ్లు ప్ర‌మోష‌న్స్ లో కాజ‌ల్ మాట్లాడుతూ..దుర‌దృష్ట‌వ‌శాత్తు చాలా కార‌ణాల వ‌ల్ల ఇండియన్ 2మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ మ‌ధ్య విబేధాలున్న‌ట్టు వార్త‌ల్లో కూడా వ‌చ్చింది. అదే స‌మ‌యంలో క్రేన్ ప్ర‌మాదం జ‌రిగింది. క‌మ‌ల్‌హాస‌న్ బ‌హిరంగంగా నిర్మాణ సంస్థ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని చెప్పుకొచ్చింది.

చిత్ర‌యూనిట్ మెంబ‌ర్స్ అమెరికా వ్య‌క్తులు కావ‌డంతో కోవిడ్ ఆంక్ష‌ల కార‌ణంగా ఇప్ప‌ట్లో షూటింగ్ మొద‌లు పెట్టే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో క‌మ‌ల్‌హాస‌న్ మ‌క్క‌ల్ నీధి మ‌య్యం పార్టీ కార్య‌క‌లాపాల‌తో బిజీగా ఉన్నారు. మ‌రి ఇండియ‌న్ 2 సినిమా ఇప్ప‌ట్లో వ‌స్తుందా..? అస‌లు సినిమానే ఉండ‌దా..? అనేది తెలియాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
'ఇండియ‌న్ 2' పై కాజ‌ల్ క్లారిటీ

ట్రెండింగ్‌

Advertisement