మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్టు సీతారామమ్ (Sita Ramam). వార్ బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ తాజాగా కానున్న కల్యాణం పాట (Kaanunna Kalyanam Lyrical video)ను రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ మధ్య అద్బుతమైన కెమిస్ట్రీతో సాగుతూ ఈ పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), కన్నడ భామ రష్మిక ( Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్, సుమంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇందులో రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్‌గా కనిపించనుండగా..సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మ కనిపించబోతున్నాడు. తరుణ్ భాస్కర్ బాలాజీ పాత్రలో నటిస్తున్నాడు.
ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది సీతారామం. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Read Also : Ritika Singh | ‘ఓ సక్కనోడా..నిన్ను పట్టేసుకుంటా’..రితికాసింగ్ వీడియో వైరల్