e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడురోజుల పాటు జ్యేష్టాభిషేకం…

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడురోజుల పాటు జ్యేష్టాభిషేకం…

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడురోజుల పాటు జ్యేష్టాభిషేకం…

తిరుపతి,జూలై: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమ‌వారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనావ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

అందులో భాగంగా ఉద‌యం 8.30 నుంచి10.30 గంట‌ల వ‌ర‌కు శ‌త‌క‌ల‌శ స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఆ త‌రువాత ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడురోజుల పాటు జ్యేష్టాభిషేకం…
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడురోజుల పాటు జ్యేష్టాభిషేకం…
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడురోజుల పాటు జ్యేష్టాభిషేకం…

ట్రెండింగ్‌

Advertisement