e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, April 13, 2021
Advertisement
Home News ‘భారత్ మాతా కీ జై’ అనే బీజేపీ నేతలే దేశభక్తులు కాదు: సీఎం ఉద్ధవ్‌

‘భారత్ మాతా కీ జై’ అనే బీజేపీ నేతలే దేశభక్తులు కాదు: సీఎం ఉద్ధవ్‌

‘భారత్ మాతా కీ జై’ అనే బీజేపీ నేతలే దేశభక్తులు కాదు: సీఎం ఉద్ధవ్‌

ముంబై: ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు ఇచ్చే బీజేపీ నేతలే దేశభక్తులు కాదని మహారాష్ట్ర సీఎం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీజేపీపై మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో శివసేన పాల్గొన్నలేదన్న ఉద్ధవ్‌, బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అందులో పాల్గొనలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేసినంత మాత్రానా ‘ బీజేపీ నేతలు నిజమైన దేశభక్తులు కారని వ్యాఖ్యానించారు. 

బీజేపీ నుంచి హిందుత్వాన్ని నేర్చుకోవలసిన అవసరం తమకు లేదని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి తాము చత్రపతి శివాజీ మహారాజ్‌ పేరు పెట్టామని తెలిపారు. అయితే బీజేపీ మాత్రం గుజరాత్‌లోని మోతెరాలో సర్దార్‌ పటేల్‌ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చిందని దుయ్యబట్టారు. స్టేడియం పేరు మార్చినంత మాత్రానా తాము ఏ క్రికెట్‌ మ్యాచ్‌ ఓడిపోలేదని గుర్తు చేశారు. 

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పంజాబ్‌ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఉద్ధవ్‌ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు విద్యుత్‌, నీటి సౌకర్యాన్ని తొలగించారని, రహదారుల్లో ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారని విమర్శించారు. అయితే వారు (బీజేపీ) చైనాను చూసి పారిపోయారని ఎద్దేవా చేశారు. చైనా లేదా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేసి ఉంటే చొరబాట్లు జరుగవని వ్యాఖ్యానించారు. 

Advertisement
‘భారత్ మాతా కీ జై’ అనే బీజేపీ నేతలే దేశభక్తులు కాదు: సీఎం ఉద్ధవ్‌

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement