e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home General Jogulamba: కాళరాత్రి దేవీగా జోగుళాంబా దేవి

Jogulamba: కాళరాత్రి దేవీగా జోగుళాంబా దేవి

అలంపూర్: అలంపూరులోని జోగుళాంబా బాల బ్రహ్మేశ్వర ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మం గళవారం జోగుళాంబాదేవి కాళరాత్రి దేవీగాభక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మహా మంగళహారతితో మొదలైన పూజా కార్యక్రమాలు యాగశాల ప్రవేశంలో ఆవాహిత దేవతలకు మంటపారాధనలకు శోఢశోపచార ప్రధోష కాలపూజలు, చండీ హోమాలు, త్రిశతి అర్చన, నవాన్నసహిత నివేదనం, కుంకుమార్చన మండపంలో కుంకుమార్చనలు, సాయంత్రం సహస్రనామార్చన, రాత్రి ఏడు గంటలకు దశ విధ హారతులు నిర్వహించారు.


రాత్రి ఏడు గంటలకు మహా మంగళ హారతి అనంతరం జోగుళాంబాదేవీ కాలరాత్రిగా అలంకరించి పూజించారు. అర్చకులు కుమారి సువాసిని పూజలు, దర్భారు సేవ, కొలువు పూజ, మహా మంగళ హారతి మొదలగు కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో వీరేశం, ఆలయ కమటీ చైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్, పాలక మండలి సభ్యులు, భక్తు లు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -


కాళరాత్రిదేవీగా..
సంపూర్ణ వర్ణాలతో సాక్షాత్కరించే కాళరాత్రి దేవి త్రినేత్రాలతో ప్రకాశిస్తుంది. గార్డీభం అనే గాడిద దుర్గాదేవి వాహనంగా చేసు కుని చెల్లా చెదురైన శిరోజాలతో సప్త మ శక్తిగా పూజింపబడుతున్న ఈ మాతను శుభంకరీ అని కూడా ఆరాధిస్తారు. ఈ మాతను ఉపాసించడం వల్ల విపత్తులను పటాపంచలు చేసి సర్వత్రా సౌభాగ్యం ప్రసాదిస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement