e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home News Jogulamba: భక్తి శ్రద్ధలతో దుర్గాష్టమి

Jogulamba: భక్తి శ్రద్ధలతో దుర్గాష్టమి

అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు బుధవారం అమ్మ వారిని మహాగౌరి దేవీగా అలంకరించి ఆరాదించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతి రోజూ విశేష పూజలు కొనసాగుతున్నాయి. అమ్మ వారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉంది.

ఆలయంలో ఉత్సవాల పూజల్లో భాగంగా యాగశాలలోను ఆవాహిత దేవతలకు మండపారాదనలకు, శోడశోపచార ప్రాతః కాల పూజలు, నిత్యానుష్టాన ఆవాహితా దేవతా హోమాలు నిర్వహించారు. యాగశాలలో మరోవైపు చండీహోమాలు కొనసాగించారు.

- Advertisement -

ఉదయం 9 గంటలకు ప్రాంతంలో రథాంగ హోమం నిర్వహించారు.10 గంటలకు అమ్మ వారి రథోత్సవం వైభవంగా పుర వీదుల గుండా ఓం నమశివాయ, జోగుళాంబ మాతాకు జై అంటూ నినాదాలతో, అర్చకుల మంత్రోచ్చారణలతో ముందు కు సాగింది.

పురవీదుల్లో భక్తులు అమ్మవారి రథోత్సవాన్ని కన్నులారా వీక్షీంచి తరించారు. అమ్మవారి రథం ఆలయం చేరుకున్న తర్వాత అర్చకులు అమ్మ వారికి నవాన్న సహిత నివేదన సమరించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో అమ్మ వారి దర్శన విరామంలో ఏకాంత ప్రదోష కాల అర్చన నిర్వహించి మహా మంగళ హారతి ఇచ్చారు. గర్భాలయం ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో జోగుళాంబ దేవీని మహాగౌరిగా అలంకరించి ఆరాదించారు.

పట్టణంలోని కన్యాక పరమేశ్వరి ఆల యంలో,కంచి కామాక్షీ ఆలయంలో,యోగ నరసింహ్మస్వామి ఆలయంలో ఉత్సవా ల్లో భాగంగా సాయంత్ర వేళల్లో విశేష పూజలు నిర్వహిస్తూన్నట్టు ఆలయ ఈవో వీరేశం ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని గుందిమల్ల ఝూంకారేశ్వరి ఆలయంలో, బైరాపురంలోని నిత్యాభావన అశ్రమం రాజరాజే శ్వరీ ఆలయంలో గత వారం రోజులుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తన్నారు.

మహాగౌరి దేవీగా అమ్మవారు
సర్వ వస్ర్తాలు, సర్వ ఆభరణాలు మహాగౌరి దేవీకి అమ్మవారి శ్వేత వర్ణంలోనే ఉంటాయి. మహాగౌరి ఆరాధన వల్ల పూర్వ జన్మ పాపకర్మలు ప్రక్షాళన చేయబడుతాయని నమ్మకం. మహా గౌరి, సిద్ధిదాత్రి ద్యానస్మరణ వల్ల సకల శుభాలు కలు గుతాయని పురాణాల్లో పెర్కొన్నట్టు అర్చకులు భక్తులకు వివరించారు. మహా గౌరి అలంకరణలు ఉన్న జోగుళాంబ దేవీని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రాదాల వితరణ చేశారు.


క్షేత్రంలో విద్యుత్ వెలుగులు
దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా దేవస్థానం వారు అలంకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పట్టణ ప్రవేశం దగ్గ ర నుంచి ఆలయం వరకు స్వాగత తోరణాలు, వివిధ డిజైన్లతో జిగేల్ మనే లెడ్ లైట్లు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాల అలంకరణలు భక్తులకు ఎంతగానో ఆకట్టుకుటున్నాయి. ఆలయ పరసరాల మొత్తం విద్యుత్ దీపాల తోరణాలతో అహ్లాదంగా శోభాయమానంగా భక్తులను తన్మయానికి గురి చేస్తూ ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement