జైపూర్: మానవత్వంతో ఉండాల్సిన ఓ డాక్టర్ అమానవీయంగా వ్యవహరించారు. తన ఇంటివద్ద ఉండే వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. కారువెంట పరిగెత్తలేకపోయిన ఆ మూగజీవి చిత్రహింస అనుభవించిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో (Jodhpur) చోచేసుకున్నది.
జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్ రజనీశ్ గల్వా ఇంటివద్ద ఓ వీధి కుక్క ఉన్నది. దానిని ఊరిబయట వదిలిపెట్టాలనుకున్నాడు. దీంతో అతడు దాని మూతిని ఓ తాడుతో కట్టి.. తన కారుతో ఊరంతా తిప్పాడు. ఈ క్రమంలో కారుతోపాటు పరిగెత్తలేకపోతున్న ఆ శునకాన్ని గమనించిన ఓ బైకర్.. వెంటనే ఆ కారును ఆపాడు. కుక్క మూతికి ఉన్న తాడు విడిపించాడు. అనంతరం డాగ్ హోమ్ ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించాడు. వారు ఆ శునకాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై డాగ్ హోమ్ ఫౌండేషన్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ డాక్టర్‌పై జంతుహింస చట్టం కింద కేసు నమోదుచేశారు.