దోహా/లిస్బన్, జూలై 4: మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఈ ఆఫర్. ఎలాంటి అనుభవం అక్కర్లేదు.. చివరికి రెజ్యూమ్ కూడా అవసరం లేదు. నేరుగా ఉద్యోగంలో చేరిపోవచ్చు. కరోనా నేపథ్యంలో ఐరోపాలో పర్యాటకరంగం కుదేలైంది. ఆ సమయంలో చాలా మంది ఉద్యోగులు మానేసి వేరే రంగాలను ఎంచుకున్నారు. పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే కరోనా దెబ్బ నుంచి కోలుకుంటున్నది. అయితే ఈ రంగానికి కావాల్సిన ఉద్యోగులు దొరక్కపోవడంతో ఎలాంటి షరతులు పెట్టకుండా అక్కడ ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత వారే శిక్షణ ఇచ్చి పనిలో పెట్టుకుంటున్నారు. స్పెయిన్, పోర్చుగల్లో ఉద్యోగుల కొరత చాలా తీవ్రంగా ఉంది. అనేక హోటల్ యాజమాన్యాలు ఉద్యోగులకు భారీ మొత్తంలో చెల్లించడమే కాకుండా, ఉచిత నివాస సదుపాయం కల్పిస్తున్నది.