న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో వివిధ రంగాల్లో ఉద్యోగాల తీరుతెన్నులే మారిపోయాయి. జాబ్ ప్రొఫైల్స్ మారిపోగా, ఫ్రీలాన్స్ ఉద్యోగులకు ఏడాది కాలంగా డిమాండ్ పెరిగింది. గతంలో పశ్చిమ దేశాల్లో ఫ్రీలాన్స్ ఉద్యోగులకు ఉండే డిమాండ్.. క్రమంగా మనదేశంలో పెరుగుతున్నది.
గతంలో శైశవ దశలో ఉన్న ఫ్రీలాన్సింగ్ జాబ్స్.. కరోనా వల్ల గ్రోత్ సాధించాయి. వివిధ సంస్థలు సైతం తమ వర్క్ ఫోర్స్‌లో ఫ్రీలాన్సర్లకు పెద్దపీట వేస్తున్నాయని హెచ్ఆర్ కన్సల్టెంట్లు పేర్కొన్నారు. ఫ్రీలాన్సర్లు అంటే ఒకరకంగా స్వతంత్ర ఉద్యోగులుగా భావించొచ్చు.
కంపెనీలు ఒక ప్రత్యేక పని కోసం వారిని నియమించుకుని, అందుకు తగ్గ పారితోషికం చెల్లిస్తాయి. పని పూర్తయితే వారికి కంపెనీతో ఏ సంబంధం ఉండదు. ఒకవేళ మళ్లీ వారి సేవలు అవసరమైతే.. కొత్త ప్రాజెక్టుకు కొత్త పారితోషికం ఇస్తుంటాయి.
లాక్డౌన్ ప్రభావంతో చాలా వ్యాపారాలు దెబ్బతిని.. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రాజెక్టులు, పనులు తగ్గిపోయి ఉద్యోగుల నిర్వహణ కంపెనీలకు భారంగా మారింది. ఫలితంగా సంస్థలు ఆదా చర్యల్లో భాగంగా తొలగించిన ఉద్యోగులకు ఫ్రీలాన్స్ సేవలకు అవకాశం ఇచ్చాయి.
కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో వ్యాపారాల్లో ఇంకా కొంత అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో కొన్ని సంస్థలు శాశ్వత ఉద్యోగుల కంటే ఫ్రీలాన్సర్లే మేలని భావిస్తున్నాయి.
కరోనా వేళ వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. కొన్నేండ్లు ఒకే రంగంలో నైపుణ్యం సాధించిన వారిని కూడా కంపెనీలు తప్పించేశాయి. దీంతో వీరంతా ప్రత్యామ్నాయ ఉపాధి వేటలో భాగంగా ఫ్రీలాన్సర్లుగా మారిపోతున్నారు. వారికున్న నైపుణ్యంతో కంపెనీల అవసరం మేరకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ తెలిపిన గణాంకాల ప్రకారం.. ఫ్రీలాన్సర్ జాబ్ మార్కెట్ 2019-2021 మధ్య 22% పుంజుకుంది. 2019తో పోలిస్తే గత ఏడాది మే-జూన్ మధ్య సంస్థలు ఫ్రీలాన్సర్లకు ఇచ్చే అవకాశాలు రెండింతందని గణాంకాలు చెబుతున్నాయి.
కంప్యూటర్ ఆధారిత సంస్థల్లో ఫ్రీలాన్సర్లకు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, హెచ్ఆర్ సంస్థలు, ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ వంటి రంగాల్లో ఫ్రీలాన్స్ ఉద్యోగులకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇక పీహెచ్‌పీ డెవలపర్లు, రిక్రూటర్లు, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, కంటెంట్ రైటర్, డిజిటల్ మార్కెటర్లుగా పనిచేసే వారికి సంస్థలు అధికంగా చెల్లించడానికి ముందుకొస్తున్నాయి.
మోటార్ ఫీల్డ్‌కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్‌ల ధరలు పైపైకి..!!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!