సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ అనుకూల వాతావరణాన్ని పెంపొందించడంపై టీ హబ్ ప్రధానంగా దృష్టి సారించింది. సరికొత్త ఆవిష్కరణలు చేసే సత్తా ఉన్న స్టార్టప్లకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి టీ హబ్ పనిచేస్తున్నది. తాజాగా జేకే టెక్ సంస్థతో టీ హబ్ రూ.74 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు.