e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News జేఈఈ టాపర్‌ శరణ్య

జేఈఈ టాపర్‌ శరణ్య


బాలికల విభాగంలో దేశంలోనే టాపర్
మెయిన్‌లో మన అమ్మాయికి 99.99 పర్సంటైల్‌
బాలుర విభాగంలో రాష్ట్ర టాపర్‌గా విశ్వనాథ్‌
ఎస్టీ కోటాలో టాప్‌ 3లో తెలంగాణ విద్యార్థులే
దేశవ్యాప్తంగా ఈ సారి ఆరుగురికే 100 పర్సంటైల్‌
గతేడాది 24 మందికి.. ఫలితాలపై కరోనా ప్రభావం

జేఈఈ టాపర్‌ శరణ్య

హైదరాబాద్‌, మార్చి 8 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్‌ బాలికల విభాగంలో రాష్ర్టానికి చెందిన కే శరణ్య 99.99 పర్సంటైల్‌ సాధించి దేశంలోనే టాపర్‌గా నిలిచింది. 99.99 పర్సంటైల్‌తో చల్లా విశ్వనాథ్‌ తెలంగాణ టాపర్‌గా నిలిచాడు. ఎస్టీ కోటాలో టాప్‌-3 స్థానాలను తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకొన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకుగాను ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1(బీఈ, బీటెట్‌) పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఫలితాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆరుగురు 100 పర్సంటైల్‌ సాధించగా అందరూ అబ్బాయిలే.
తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కరు కూడా 100 పర్సంటైల్‌ సాధించలేదు. ఫలితాలను ఎన్టీఏ సోమవారం రాత్రి తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. పరీక్షకు 6.52 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 6.20 లక్షల మంది హాజరయ్యారు. వాస్తవానికి ఫలితాలు ఆదివారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. ఫలితాల విడుదలలో అనిశ్చితి, ఎన్టీఏ అలసత్వంపై విమర్శలు వస్తున్నాయి. గతేడాది కూడా అర్ధరాత్రి ఫలితాలను ప్రకటించారు. సాకేత్‌ ఝా (రాజస్థాన్‌), ప్రవార్‌ కఠారియా, రంజిమ్‌ ప్రభల్‌ దాస్‌ (ఢిల్లీ), గురమృత్‌ సింగ్‌ (చండీగఢ్‌), సిద్ధాంత్‌ ముఖర్జీ (మహారాష్ట్ర), ఆనంద్‌ కృష్ణ కిదాంబి (గుజరాత్‌) 100 పర్సంటైల్‌ సాధించారు.
రోనా ప్రభావం
జేఈఈ మెయిన్‌ పరీక్షలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. గతేడాది జేఈఈ మెయిన్‌లో 24 మంది 100 పర్సంటైల్‌ సాధించారు. ఈ ఏడాది కేవలం ఆరుగురికే 100 పర్సంటైల్‌ వచ్చింది.
ప్రశ్నల్లో చాయిస్‌తో గందరగోళం
ఈ ఏడాది ప్రశ్నల్లో చాయిస్‌నివ్వడం విద్యార్థుల్లో గందరగోళానికి దారితీసిందని నిపుణులు భావిస్తున్నారు. న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల్లో ఒకటి తప్పుగా ఉండటంతో ఆ ప్రశ్నను రాసివారికి మార్కులు ఇచ్చారు. ఐదు ప్రశ్నలు రాసినవారికి మార్కులివ్వకపోవడంతో వారంతా నష్టపోయినట్టు చైతన్య ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆల్‌ ఇండియా ఐఐటీ కో ఆర్డినేటర్‌ ఎం. ఉమాశంకర్‌ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ విద్యార్థుల ఫలితాలు
చల్లా విశ్వనాథ్‌- 99.99 పర్సంటైల్‌(టాపర్‌గా తెలంగాణ టాపర్‌)
కే శరణ్య – 99.99 పర్సంటైల్‌(మహిళా కోటాలో జాతీయ స్థాయి టాపర్‌)
ఇస్లావత్‌ నితిన్‌ – 99.99, బిజిలి ప్రచోతన్‌ వర్మ- 99.98, నేనావత్‌ ప్రీతమ్‌- 99.97 పర్సంటైల్‌తో ఎస్టీ కోటాలో జాతీయ టాపర్లుగా నిలిచారు.
అమేయ విక్రమసింగ్‌ – 99. 99 పర్సంటైల్‌తో (అబ్బాయిల కోటాలో జాతీయస్థాయిలో 8వ ర్యాంక్‌)
అంచ ప్రణవి – 99.99, రామస్వామి సంతోష్‌రెడ్డి – 99.99 పర్సంటైల్‌తో జనరల్‌ (ఈడబ్యూఎస్‌ కోటా)లో ఉత్తమం.

Advertisement
జేఈఈ టాపర్‌ శరణ్య
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement