బాలీవుడ్ లో తన అందంతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేసే భామలు కొద్ది మందే ఉన్నారు. వారిలో టాప్ ప్లేస్ లో ఉంటుంది శ్రీలంకన్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. సోషల్‌మీడియాలో తన ఫాలోవర్లకు ఏదో ఒక పోస్ట్‌తో జోష్ ఇస్తుంటుంది జాక్వెలిన్. ఈ బ్యూటీ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన టాప్‌లెస్ స్టిల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పడకపై వాలిపోయి టాప్‌లెస్ లో కెమెరాకు పోజులిచ్చింది జాక్వెలిన్. వావా..అత్యంత ఆకర్షణీయంగా..అంటూ స్టిల్కు సరిపోయే క్యాప్షన్ ను ఇచ్చింది జాక్వెలిన్.
ఈ స్టిల్ ఇపుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. జాక్వెలిన్ ప్రస్తుతం అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తోన్న బచ్చన్ పాండే చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ చిత్రంలో కృతిసనన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, యామీ గౌతమ్ తో కలిసి నటిస్తున్న భూత్ పోలీస్ షూటింగ్ పూర్తి చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.