సినిమాలతో వినోదాన్ని అందించడమే కాదు..సినిమాలు లేనపుడు సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). ఈ బాలీవుడ్ (Bollywood) భామ అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట్లో పెడుతూ అందరిలో జోష్ నింపుతుంటుంది. తీరిక లేకుండా ఉన్నపుడు త్రోబ్యాక్ స్టిల్స్, వీడియోలను అందరితో పంచుకుంటుంది.
తాజాగా జాన్వీకపూర్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం మాల్దీవుల (Maldives)కు వెళ్లినపుడు సందడి చేసిన త్రోబ్యాక్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నేను మానసికంగా ఇక్కడున్నాను..అంటూ తిమింగలం ఐకాన్ ను క్యాప్షన్ గా పెట్టింది. సిల్వర్ కలర్ బికినీ (silver swimsuit) షూట్ లో ఉన్న జాన్వీకపూర్ సాగరతీరంలో జలకాలాడుతూ..తన కురులతో విన్యాసం చేస్తున్న స్లో మోషన్ వీడియో ఇపుడు నెట్టింట హీట్ పుట్టిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఓ ట్రావెల్ మ్యాగజైన్ (Travel magazine) ఫొటోషూట్ కోసం మాల్దీవులకు వెళ్లింది జాన్వీకపూర్. ఆ ఆల్బమ్ లో నుంచి బయటకు తీసిన ఈ ఒక్క వీడియోనే నెటిజన్ల మనసు ఇంతలా దోచేస్తుందంటే. ఇంకా రానున్న రోజుల్లో జాన్వీ ఎలాంటి త్రోబ్యాక్ మెమొరీలను షేర్ చేసుకుంటుందో చూడాలి.
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు