న్యూఢిల్లీ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 8న ప్రారంభమవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ ఎంట్రీ, స్టెనోగ్రాఫర్ ఎల్డీసీఈ పోస్టులు ఉన్నాయి. మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 38
ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ / స్టెనోగ్రాఫర్ (డైరెక్ట్ ఎంట్రీ) 21, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్/స్టెనోగ్రాఫర్ (ఎల్డీసీఈ) 17 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఇంటర్, సీనియర్ సెకండరీ సర్టిఫికెట్ ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ. 100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 8
దరఖాస్తులకు చివరితేదీ: జులై 7
వెబ్సైట్: www.recruitment.itbpolice.nic.in